టీడీపీ కార్యకర్తల అనుచిత ప్రవర్తనపై ఎస్పీకి ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

టీడీపీ కార్యకర్తల అనుచిత ప్రవర్తనపై ఎస్పీకి ఫిర్యాదు

May 30 2026 12:17 AM | Updated on May 30 2026 12:17 AM

అమలాపురం టౌన్‌: ఇళ్ల మధ్య ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్న టీడీపీ కార్యకర్తలపై రాజోలు మండలం తాటిపాక గ్రామానికి చెందిన వంద మందికి పైగా జనం ఎస్పీ రాహుల్‌ మీనాకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, ఎంపీ హరీష్‌ మాధూర్‌ అనుచరుడనని చెప్పుకునే సాయి సూర్య అనుచరులు ఇళ్ల మధ్య ప్రజలు ఇబ్బంది పడే రీతిలో ప్రవర్తిస్తూ, తమపై దౌర్జన్యాలు చేస్తున్నారని వారు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వీరి వల్ల ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఇదే విషయాన్ని రెండు రోజుల కిందట అమలాపురంలో ఎంపీ హరీష్‌ మాథూర్‌, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజులను స్వయంగా కలిసి సాయి సూర్య అనుచరుల దౌర్జన్యాల వల్ల వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గ్రామస్తులు వివరించారు.

పదోన్నతి పొందిన ప్రసాద్‌కు

ఎస్పీ అభినందన

అమలాపురం టౌన్‌: నాన్‌ క్యాడర్‌ ఎస్పీగా పదోన్నతి పొందిన ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్‌ను ఎస్పీ రాహుల్‌ మీనా అభినందించారు. ఆయన అందించిన సేవలు అభినందనీయమని అన్నారు. ప్రసాద్‌కు ఎస్పీ కార్యాలయంలో శుక్ర వారం జరిగిన అభినందన కార్యక్రమంలో ఎస్పీ మీనా మాట్లాడారు. ఏఎస్పీ ప్రసాద్‌ను ఏఆర్‌ డీఎస్పీ సుబ్బరాజు, స్పెషల్‌ బ్రాంచి సీఐ వి.పుల్లారావు, సోషల్‌ మీడియా సీఐ తమ్మినాయుడు, ఎస్సైలు, పోలీస్‌ సిబ్బంది అభినందించారు.

ఎస్పీ– సంపర్క్‌

జిల్లాలోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో పనిచేస్తున్న పోలీస్‌ సిబ్బంది ఎస్పీ రాహుల్‌ మీనా ఎస్పీ కార్యాలయం నుంచి ఫోన్‌లో నిర్వహించిన ‘ఎస్పీ– సంపర్క్‌’ కార్యక్రమంలో పాల్గొని తమ సాధక బాధలు వివరించారు.

బాధ్యతలు స్వీకరించిన మల్లాడి

యానాం: ప్రభుత్వం కేటాయించిన చాంబర్‌లో మంత్రి హోదాలో మల్లాడి కృష్ణారావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి సీఎం రంగసామి, మంత్రి నమశ్శివాయం, పలువురు ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు హాజరై చాంబర్‌లో జరిగిన వేద మంత్రోచ్ఛరణల మధ్య జరిగిన పూజాకార్యక్రమాల్లో పాల్గొని మల్లాడి కృష్ణారావును దుశ్శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. పుదుచ్చేరి అసెంబ్లీ హాలులో గతంలో రెవెన్యూ, ఆరోగ్యశాఖ మంత్రిగా ఆయన విధులు నిర్వహించిన చాంబర్‌లోనే ఆయన మళ్లీ మంత్రి హోదాలో బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారి మునిస్వామి, అమన్‌శర్మ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement