వైఎస్సార్‌ సీపీ జిల్లా బీసీ సెల్‌ కమిటీలో నియామకాలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ జిల్లా బీసీ సెల్‌ కమిటీలో నియామకాలు

May 29 2026 10:14 AM | Updated on May 29 2026 10:14 AM

అమలాపురం రూరల్‌: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా బీసీ సెల్‌ కమిటీలో పలువురికి చోటు కల్పించారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం రాత్రి ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. జిల్లా బీసీ సెల్‌ ఉపాధ్యక్షులుగా కామన కృష్ణమూర్తి (పి.గన్నవరం) మిడా హరిబాబు (ముమ్మిడివరం), యనమదల నాగేశ్వరరావు (కొత్తపేట), జిల్లా బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శులుగా దండుమేను రూపేష్‌ (అమలాపురం) చెల్లుబోయిన బుచ్చయ్య (రాజోలు), చింతా నాగ మునీంద్రరావు (ముమ్మిడివరం) కోటని గణేశ్వరరావు (రామచంద్రపురం) వీరమల్లు శ్రీనివాస్‌(మండపేట) నియమితులయ్యారు. జిల్లా బీసీ సెల్‌ కార్యదర్శులుగా బెజవాడ సూరిబాబు (కొత్తపేట), కొల్లు రాంబాబు, బొంతు శ్రీనివాస్‌ (పి.గన్నవరం), మట్టా శ్రీనివాస యాదవ్‌ (కొత్తపేట) గుత్తుల శ్రీనివాస్‌ (రామచంద్రపురం), కంచి వెంకట రమణ, తిరుమను నరసింహస్వామి (రాజోలు), వాసంశెట్టి శ్రీనివాసరావు(మండపేట), ఇనుమర్తి లింగమూర్తి, సోమనాథపల్లి కుమారస్వామి(అమలాపురం), కాముజు రామ సుబ్రహ్మణ్యం, కొరసిక వెంకట సత్యనారాయణ (ముమ్మిడివరం)లను నియమించారు.

వీరేశ్వరస్వామి సేవలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి

ఐ.పోలవరం: మురమళ్లలో కొలువైన శ్రీభద్రకాళీ వీరేశ్వరస్వామివారిని గురువారం కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి పి.సుధ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి నిత్య కల్యాణ మహోత్సవంలో ఆమె పాల్గొన్నారు. అర్చకులు యనమండ్ర సుబ్బారావు ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో ఆమెకు స్వాగతం పలికారు. దుశ్శాలువాతో ఘనంగా సత్కరించి స్వామి చిత్రపటం, ప్రసాదాన్ని అందించారు. వేద ఆశీర్వచనం గావించారు. ఆలయ చైర్మన్‌ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్‌ కమిషనర్‌ వి సత్యనారాయణ, పర్యవేక్షణాధికారి కఠారి శ్రీనివాసరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

పేపర్‌ మిల్లు లాకౌట్‌ ఎత్తివేత!

కడియం: మాధవరాయుడుపాలెం పంచాయతీ పరిధిలోని ఆంధ్రా పేపర్‌ మిల్లు లాకౌట్‌ ఎత్తివేసినట్లు తెలుస్తోంది. యాజమాన్యం మొండి వైఖరి కారణంగా పర్మినెంట్‌, కాంట్రాక్టు కార్మికులు సమ్మెకు దిగిన విషయం విదితమే. మిల్లులోని డిపార్ట్‌మెంట్‌ హెడ్స్‌ నుంచి లాకౌట్‌ ఎత్తివేసినట్లు పర్మినెంట్‌ కార్మికులకు ఫోన్ల ద్వారా సమాచారం ఇస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement