బుధవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2026
ఫ అటు అభయం
ఫ జిల్లాలో అత్యంత బలహీనంగా ఏటిగట్లు
ఫ వర్షా కాలంలో వరద వస్తే భయం
ఫ మరమ్మతులకు పట్టించుకోని
చంద్రబాబు సర్కారు
ఫ పశ్చిమ గోదావరి జిల్లా వైపు పనులు చేయిస్తున్న మంత్రి
నిమ్మల రామానాయుడు
ఫ మన వైపు పటిష్ట పనులను విస్మరించిన పాలకులు
మలికిపురం: జిల్లాలోని ఏటిగట్లు అత్యంత బలహీనంగా మారాయి. వీటి మరమ్మతులకు చంద్రబాబు సర్కార్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కానీ పశ్చిమ గోదావరి జిల్లా వైపు మంత్రి నిమ్మల రామానాయుడు ఇలాకాలో మాత్రం జోరుగా పనులు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో వర్షాలు ప్రారంభమవుతాయి. గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తూ ముందుకు దూకుతుంది. ఆ సమయంలో లంక గ్రామాలతో పాటు ఏటిగట్టుకు ఇరువైపులా ఉన్న గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు ఉండదు. గోదావరి ఉమ్మడి జిల్లాలో మూడు ప్రధాన పాయలుగా విడిపోయి యానాం, ఓడల రేవు, అంతర్వేది పల్లిపాలెం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ పాయలకు కుడి ఎడమ వైపున సుమారు 420 కిలోమీటర్ల మేర ఏటిగట్లను నిర్మించారు. ధవళేశ్వరం ఆనకట్లను నిర్మించిన సమయంలో వేసిన ఈ ఏటిగట్లు అనంతరం బలహీన పడ్డాయి. ఇలా గత 20 ఇళ్లలో గోదావరి ఉధృతంగా ప్రవహించినప్పుడు ఆ ఏటిగట్లకు పలుచోట్ల గండ్లు పడి, గ్రామాలు ముంపునకు గురయ్యాయి.
పొంచి ఉన్న ప్రమాదం
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏటిగట్లు ప్రస్తుతం అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. వర్షాకాలంలో గోదావరికి వరద వచ్చినప్పుడు ప్రమాదం పొంచి ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే వరదల తీవ్రత అంతగా ఉండదని చెబుతున్నారు కానీ, ప్రాజెక్టు నిండితే మిగుల జలాలు సముద్రంలోనికి వదలడం ఖాయం. ఇప్పటికే ఏటా 600 టీఎంసీలకు పైగా వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో వరదలను తట్టుకునే సామర్థ్యం ప్రస్తుతం ఏటిగట్లకు లేదని అధికారులు అంచనా. వీటి అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసినా, రెండేళ్లుగా కూటమి సర్కారు పట్టించుకోవడం లేదు.
గతంలో వివిధ ఘటనలు
ఫ 1946లో వశిష్ట కుడి గట్టుకు మలికిపురం మండలం రామరాజులంక ఏటిగట్టుకు గండి పడింది. ఆ ప్రాంతానికి గండి పేటగా పేరు వచ్చింది. రాజోలు దీవి మొత్తం మునిగి పోయింది.
ఫ 1986లో పి.గన్నవరం మండలం మొండెపు లంక వద్ద ఏటిగట్టుకు గండి పడి సుమారు 30 గ్రామాలు జలమయమయ్యాయి.
ఫ 1986లోవశిష్ట కుడిగట్టుకు సిద్ధాంతం కింద పెదమల్లంలో గండి పడింది. అప్పట్లో పాలకొల్లు, నర్సాపురం పట్టణాలతో పాటు సుమారు 70 గ్రామాలు జలమయమయ్యాయి. ఇంకా పలు చోట్లు గండ్లు పడినట్లు లెక్కలు చెబుతున్నారు.
ఫ 2006లో పి.గన్నవరం పైన ఏటిగట్టుకు గండి పడి చాలా గ్రామాలు జలమయమయ్యాయి.
పశ్చిమలో పనులు చకచకా
ఏటిగట్లకు సంబంధించి పక్కనే ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో పటిష్ట పనులు వేగంగా జరుగుతున్నాయి. కానీ అత్యంత బలహీనంగా ఉన్న కోనసీమ జిల్లాలో మాత్రం అసలు పనులే ప్రారంభించలేదు. ఇరిగేషన్‌శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నియోజకవర్గంలో ఏటిగట్ల పనులు జోరుగా జరుగుతున్నాయి.
గోగన్నమఠంలో ప్రమాదకరంగా ఉన్న వైనతేయ నది కుడిగట్టు
మంత్రి నిమ్మల ఇలాకాలో దిండి అవతలి వైపు ఉన్న
చించినాడలో వశిష్ట నది కుడి గట్టు పనులు
రెండుసార్లే మరమ్మతులు
గోదావరి పాయల కుడి, ఎడమ గట్లకు గతంలో రెండు సార్లు మాత్రమే పటిష్ట పనులు చేపట్టినట్లు రైతు నాయకులు చెబుతున్నారు. 1847లో ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం ప్రారంభించి 1852లో పూర్తి చేశారు. అనంతరం 1961లో స్వల్ప కాలిక పటిష్ట పనులు చేపట్టారు. 2007 తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 65 శాతం పటిష్ట పనులు పూర్తి చేశారు. ఆయన మరణాంతరం పనులను అర్థాంతరంగా ఆపేశారు.


