పెట్రో ధరల పాపం.. చంద్రబాబుదే | - | Sakshi
Sakshi News home page

పెట్రో ధరల పాపం.. చంద్రబాబుదే

May 26 2026 3:14 AM | Updated on May 26 2026 3:14 AM

పెట్రో ఉత్పత్తుల ధరలను చంద్రబాబు ప్రభుత్వం ఇష్టానుసారంగా పెంచేస్తోంది. పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలను ఇబ్బంది పెడుతోంది. పది రోజుల వ్యవధిలో నాలుగు సార్లు పెంచడం దారుణం. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ఇదే పరిస్థితి. పెట్రోల్‌పై 31 శాతం, డీజిల్‌పై 22.5 శాతం వ్యాట్‌ను విధించి ప్రజలకు తీరని అన్యాయం చేస్తోంది. రాష్ట్రంలో చంద్రబాబు సంపదను సృష్టించడం లేదు. ప్రజల సంపదను హరిస్తున్నారు. అలాగే ఆక్వా, మొక్కజొన్న రైతుల సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారు. చమురు ధరలు సత్వరమే తగ్గించకపోతే వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు భారీ ఉద్యమానికి దిగుతాం.

– చిర్ల జగ్గిరెడ్డి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

Advertisement
 
Advertisement
Advertisement