రాత్రయితే రైట్ రైట్
ఐ.పోలవరం మండలం మురమళ్ల, ఎదుర్లంక ప్రాంతాల్లో అనధికార ర్యాంపులు ఏర్పాటు చేసి, యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. పడవలపై వెళ్లి ఇసుకను తవ్వేస్తున్నాయి. రాత్రి వేళల్లో కూడా ఈ తవ్వకాలు ఆగడం లేదు. అయినా అధికారులు ఇటువైపు చూడడం లేదు. కనీసం పట్టించుకోవడం లేదు.
ఇవి కన‘పడవ’
రాజోలులో వశిష్ఠ నదీపాయలో జోరుగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి. మొదట్లో గుట్టుచప్పుడు కాకుండా సాగిన తవ్వకాలు తరువాత బహిరంగమయ్యాయి. సోంపల్లిలో రేవును ఆనుకుని పడవల మీద ఇసుకను తీసుకువచ్చి అక్కడ నుంచి ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తున్నారు.
రాజోలు మండలం సోంపల్లిలో
పడవలపై ఇసుక రవాణా
ఫ ఆత్రేయపురం నుంచి అంతర్వేది వరకూ..
ఫ జిల్లాలో ఇసుక, మట్టి దోపిడీ
ఫ చెలరేగిపోతున్న మాఫియా
ఫ గోదావరి, సముద్ర తీరాల్లో అక్రమ తవ్వకాలు
సాక్షి, అమలాపురం/రావులపాలెం: ఇసుక.. ఇది కొందరికి కాసులు కురిపిస్తోంది. గోదావరి, సముద్ర తీరాల్లో దోపిడీకి వేదికై ంది.. ఆత్రేయపురం నుంచి అటు వశిష్ఠ నదీపాయ సముద్ర సంగమ ప్రాంతం అంతర్వేది వరకూ.. వైనతేయ కలిసే ఓడలరేవు.. గౌతమీ సంగమ ప్రాంతం బలుసుతిప్ప వరకూ నదీ పాతాలు.. సముద్ర తీరాలను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. నదీపాయలు, సముద్ర తీరం మధ్యలో దీవిగా ఉన్న కోనసీమ చుట్టూ చేరి ఇసుక, బొండు ఇసుక, మట్టిని తరలించేస్తున్నారు. చివరకు పచ్చని చేలను కూడా వదలడం లేదు. మండు టెండలు కావడంతో గోదావరి లంకల్లో నదీ ప్రవాహానికి అడ్డుగా బాటలు వేసి మరీ ఇసుక, మట్టిని కొల్లగొట్టేస్తున్నారు. వందల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లతో రూ.కోట్ల విలువైన సంపదను తరలించేస్తున్నారు. ఎన్నికల సమయంలోనే కాదు.. టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు ఇసుక దోపిడీలోనూ పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నారు. వారి ఆదేశాలను రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖ అధికారులు తూచా తప్పకుండా ఆచరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇసుక మాఫియా ఎలా రెచ్చిపోతుందో తెలుసుకుందాం.. రండి.
ఎదుర్లంక వద్ద రాత్రి వేళలో ట్రాక్టర్లపై తరలిపోతున్న ఇసుక (ఫైల్)


