ఫ తొలగిస్తే స్పందించండి
ఫ బూత్ లెవెల్ ఏజెంట్లతో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి
రామచంద్రపురం: ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై వైఎస్సార్ సీపీ బూత్ లెవిల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని, అర్హుల ఓట్లు తొలగించకుండా చూడాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి పిలుపునిచ్చారు. నియోజకవర్గ వైఎస్సార్ సీపీ బూత్ లెవెల్ ఏజెంట్లకు రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులతో స్థానిక ప్రసన్న విఘ్నేశ్వర ఫంక్షన్ హాల్ వద్ద శనివారం అవగాహన సదస్సు జరిగింది. పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, నియోజకవర్గ కో ఆర్డినేటర్ పిల్లి సూర్య ప్రకాష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చిర్ల జగ్గిరెడ్డి పాల్గొని మాట్లాడారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై ఏజెంట్లకు పూర్తి స్థాయి అవగాహన ఉండాలన్నారు. ఏజెంట్లకు సులభంగా అర్థమయ్యే రీతిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ)లో విపులంగా వివరించారు. గతంలో చాలా రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్ ద్వారా కొంత మంది ఓట్లను తొలగించడం ద్వారా, చాలా మంది ఓటమి పాలయ్యారన్నారు. అర్హుల ఓట్లు తొలగించకుండా ఎస్‌ఐఆర్‌లో నిబంధనలు పాటించే విధంగా బూత్ లెవిల్ ఏజెంట్లు చూడాలని కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు వారికి ఎప్పటికప్పుడు సూచనలు చేయాలని తెలిపారు. పార్టీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జరిగితే వెంటనే పార్టీ నేతలకు తెలియజేయాలని సూచించారు. అధ్యక్షత వహించిన పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ సూర్యప్రకాశ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు జాబితా అత్యంత కీలకమైందని, క్షేత్ర స్థాయిలో బూత్ లెవెల్ ఏజెంట్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లోని ప్రతి బూత్ పరిధిలో ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఇతర పార్టీలు ఎటువంటి అక్రమాలకు పాల్పడకుండా ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. మరో ముఖ్య అతిథి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం అన్ని విధాలా విఫలం అయ్యిందని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేస్తుందని విమర్శించారు. తాను ఎక్కడికి వెళ్లినా రామచంద్రపురం నియోజకవర్గం తనకు పుట్టినిల్లు లాంటిదని, ఇక్కడ వైఎస్సార్ సీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. టాస్క్ ఫోర్స్ సభ్యులు ఒమ్మి రఘురాం, తోరం గౌతమ్, గొల్లపల్లి డేవిడ్, జోన్– 2 బూత్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీవీఆర్ చౌదరి, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు చీకట్ల కిశోర్, స్టేట్ బూత్ కమిటీ కార్యదర్శి మార్గాని గంగాధర్ పాల్గొన్నారు. పార్టీ రైతు విభాగం ఆర్గనైజింగ్ కార్యదర్శి కొవ్వూరి త్రినాఽథ్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గాధంశెట్టి శ్రీదేవి, మాజీ ఎంపీపీలు అంబటి భవానీ, పంపన నాగమణి తదితరులు పాల్గొన్నారు.


