అక్రమాలకు ‘బాట’
ఆత్రేయపురం సరిహద్దును ఆనుకుని తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక వద్ద గోదావరి మట్టి తవ్వకాలు చేస్తున్నారు. స్థానిక రైతుల నుంచి ఆందోళన రావడంతో ఏకంగా గౌతమీ గోదావరి ప్రవాహానికి అడ్డుకట్టు వేసి ఆత్రేయపురం మండలం వద్దిపర్రు మీదుగా బాట వేసి మట్టి అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. ఊబలంక, మెర్లపాలెం సరిహద్దులలో బొండుమట్టి తవ్వకాలు చేస్తున్నారు.
ఆత్రేయపురం మండలం వద్దిపర్రు మీదుగా అక్రమ మట్టి తవ్వకాలకు వీలుగా గౌతమీ గోదావరి మధ్యలో వేసిన బాట
కన్నేసి.. కొల్లగొట్టేసి
చంద్రబాబు ప్రభుత్వం కొలువు దీరగానే ఆ పార్టీకి చెందిన ప్రముఖుడికి చెందిన మానసాస్ ట్రస్టు భూములను అక్రమార్కులు చెరబట్టారు. వందలాది లారీల ఇసుక తవ్వేశారు. ఇసుకతో పాటు ఇప్పుడు మట్టి తవ్వకాల వంతు మొదలైంది. అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం వంటి లంక గ్రామాల్లో ఐదు నుంచి పది అడుగుల లోతున మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. దీనివల్ల నదీ గర్భంలో లంక గ్రామాలు కలిసిపోయే ప్రమాదం ఏర్పడినా పట్టించుకునే వారు లేకుండా పోయారు.
వీరవల్లిపాలెం లంక గ్రామాల్లో కొబ్బరి తోటలను ఆనుకుని మట్టి తవ్వకాలు


