అమలాపురం టౌన్: ఎస్పీ కార్యాలయంలో ప్రతి శుక్రవారం ఎస్పీ రాహుల్ మీనా పోలీసుల సమస్యలపై ‘ఎస్పీ– సంపర్క్’ పేరుతో పరిష్కార వేదికను నిర్వహిస్తున్నారు. ఈ శుక్రవారం నిర్వహించిన ఎస్పీ– సంప ర్క్ కార్యక్రమంలో జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న కొంతమంది పోలీసులు తమ వ్యక్తిగత సమస్యలు ఎస్పీకి ఫోన్‌లో చెప్పుకుని పరిష్కారాన్ని అభ్యర్థించారు. బదిలీలు, సెలవులు, ఆరోగ్య సమస్య లు, సర్వీస్ పరమైన ఇబ్బందులను ఎస్పీకి చెప్పుకున్నారు. పోలీసులు విధి నిర్వహణలో ఒత్తిడిని అధిగమించేలా వారి సంక్షేమం కోసం సమస్యలపై సానుకూలంగా స్పందించి వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ మీనా తెలిపారు.


