రావులపాలెం: మండలంలోని రావుడుపాడులో నేషనల్ హైవే పక్కన ఉన్న ఆటోమొబైల్ షాప్‌లో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. పక్కనే ఉన్న భారత్ పెట్రోల్ బంక్ సిబ్బంది అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో కొత్తపేట ఫైర్ ఆఫీసర్ పి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అమలాపురానికి చెందిన నెల్లి వెంకటేశ్వరరావుకు హైవే పక్కన కోనసీమ ఆటోమొబైల్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్ షాపు ఉంది. సుమారు ఏడాది నుంచి షాపు మూసివేసి ఉంది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిపడేసిన సిగరెట్ వల్ల అగ్ని ప్రమాదం సంబంధించిందని అంచనా వేస్తున్నారు. షాపులో ఉన్న ఫర్నిచర్, ఎలక్ట్రికల్ వైర్లు, ఆయిల్ డబ్బాలు కాలి బూడిదయ్యాయి. రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల నష్టం వాటిల్లిందని ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు.
రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల నష్టం


