పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడంతో నిత్యావసర సరకులు ధరలు పెరిగి సామాన్యుల బతుకులపై భారం మోపారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి సామాన్యులకు మేలు చేస్తాం, సంపద సృష్టిస్తామని హామీలిచ్చారు. ఇప్పుడు భారం మోపుతున్నారు.
–పొన్నాడ వెంకట సతీష్‌కుమార్,
ముమ్మిడివరం నియోజకవర్గ కోఆర్డినేటర్
ప్రజా సంక్షేమాన్ని విస్మరించారు
చంద్రబాబు పూర్తిగా ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ఇంధన ధరలను పెంచి భారం మోపారు. ఎన్నికల ముందు ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు పెట్రోల్ ధరలు ఎందుకు పెంచారో? పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో దాని ప్రభావం ఇతర నిత్యావసర వస్తువులపై పడనుంది.
–పాముల రాజేశ్వరీదేవి, రాజోలు నియోజకవర్గ కోఆర్డినేటర్
అన్ని వర్గాలపైనా ప్రభావం
దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే అధిక ధరలకు పెట్రోలు, డీజిల్ విక్రయిస్తూ సామాన్యులపై మోయలేని భారం వేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత అన్నివర్గాలు ఇబ్బంది పడుతున్నారు. సంక్షేమం విషయంలోనే కాదు.. అన్ని రంగాల్లో భారం మోపారు.
–డాక్టర్ పినిపే శ్రీకాంత్, అమలాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్


