అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 25 అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్‌లు తమ చాంబర్ల నుంచి ఈ గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు వచ్చి తమ సమస్యలపై ఎస్పీ, ఏఎస్పీలకు ఫిర్యాదు పత్రాలు అందించారు. అర్జీల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండి పారదర్శంగా దర్యాప్తు చేసి, పరిష్కారం వేగవంతంగా చూపాలని ఎస్పీ మీనా జిల్లాలోని సీఐలు, ఎస్సైలను ఫోన్లలో ఆదేశించారు. వచ్చిన ఫిర్యాదుల్లో కుటుంబ, ఆస్తి వివాదాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి.


