నారాయణాచార్యులు జీవితం ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

నారాయణాచార్యులు జీవితం ఆదర్శం

Mar 29 2026 7:01 AM | Updated on Mar 29 2026 7:01 AM

అమలాపురం రూరల్‌: పుట్టపర్తి నారాయణాచార్యులు జీవితం ఆదర్శమని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ అన్నారు. శనివారం నారాయణాచార్యుల జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా కలెక్టరేట్‌లో నిర్వహించారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి తదితరులు పాల్గొన్నారు.

అమలాపురం టౌన్‌: తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలు అందించిన పుట్టపర్తి నారాయణాచార్యులు బహుభాషా కోవిదుడని ఎస్పీ రాహుల్‌ మీనా అన్నారు. అమలాపురంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో పుట్టపర్తి నారాయణాచార్యుల చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అడిషనల్‌ ఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్‌, ఏఆర్‌ డీఎస్పీ సుబ్బరాజు, ఎస్‌బీసీఐ పుల్లారావు పాల్గొన్నారు.

విద్యుత్‌ బిల్లులు

నేడూ చెల్లించొచ్చు

అమలాపురం రూరల్‌: జిల్లాలోని అన్ని విద్యుత్‌ రెవెన్యూ కార్యాలయాల్లో ఆదివారం కూడా విద్యుత్‌ బిల్లులు చెల్లించవచ్చని ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ ఎస్‌.రాజేశ్వరి తెలిపారు. అలాగే సెక్షన్‌ ఆఫీస్‌ కౌంటర్లు, ఏటీపీ కేంద్రాలు పనిచేస్తాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement