లూప్ వేస్తున్నాం
పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో నార్మల్ డెలివరీలు, రెండో కాన్పు సిజేరియన్ జరిగిన వారికి ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేస్తున్నాం. ప్రస్తుతం ఎటువంటి అధికారిక ఆదేశాలూ లేనప్పటికీ.. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి ట్యూబెక్టమీ ఆపరేషన్ కోసం వచ్చేవారికి లూప్ వేస్తున్నాం. ఆపరేషన్లు చేయడం లేదు.
– ఎం.కీర్తి, సూపరింటెండెంట్,
సీహెచ్‌సీ, పిఠాపురం
·˘ A糚yól MýS$.°. Bç³Æó‡çÙ¯ŒS
·˘ {糿¶æ$™éÓçܵ{™èl$ÌZÏ Mö™èl¢ °º…«§ýl¯]lË$
·˘ Ô>ç³…V> Ð]l*ǯ]l çÜÆ>PÆý‡$ Ñ«§é¯]l…
·˘ »êÍ…™èlÌS B…§øâýæ¯]l
పిఠాపురం: పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ పేరిట ప్రతి జంటా ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. ఇందుకు తగినట్టుగానే ప్రజలు జనాభా నియంత్రణ విధానాలకు స్వస్తి చెప్పాలని, ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా చెప్పారు. దీనిపై స్పష్టమైన ఆదేశాలేవీ ఇంకా రాకముందే ప్రభుత్వాస్పత్రులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తోంది. జనాభా నియంత్రణ పేరిట ఇప్పటి వరకూ ఒకటి లేదా రెండు కాన్పులకే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేవారు. అటువంటిది ఇప్పుడు మూడో బిడ్డను కంటేనే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేస్తామంటూ పలు ప్రభుత్వాస్పత్రుల్లోని వైద్యులు షరతులు పెడుతున్నారు. దీంతో, ప్రభుత్వాస్పత్రుల్లో కు.ని. శస్త్రచికిత్సలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఉదాహరణకు పిఠాపురం సామాజిక ఆరోగ్య కేంద్రం(సీహెచ్‌సీ)లో గత ప్రభుత్వ హయాంలో ఏటా సుమారు 1,100 కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు జరిగేవి. దీని ప్రకారం ప్రతి నెలా దాదాపు 91 శస్త్రచికిత్సలు చేసేవారు. అటువంటిది గత జనవరి నుంచి నెలకు 25కు మించి ఆపరేషన్లు జరగడం లేదు. దీనినిబట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
స్తోమత లేదన్నా..
సాధారణంగా నిరుపేదలు ఎక్కువ శాతం ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వాస్పత్రుల్లోనే పురుడు పోసుకుని, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటూంటారు. అటువంటిది ఇప్పుడు ఇద్దరు బిడ్డల్ని కన్న తల్లులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వస్తే.. మూడో బిడ్డను కనే వరకూ ఆపరేషన్ చేయబోమని కరాఖండీగా చెప్పేస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇది బాలింతలకు శాపంగా మారింది. పేదరికం, ఇతర కారణాలతో మూడో బిడ్డను పోషించే ఆర్థిక స్తోమత తమకు లేదని, ఇద్దరు బిడ్డలతో సరిపెట్టుకుంటామని ఎంత వేడుకుంటున్నా ప్రభుత్వాస్పత్రుల్లోని వైద్యులు వినడం లేదని తల్లులు ఆవేదన చెందుతున్నారు. గత్యంతరం లేక కొంత మంది తల్లిదండ్రులు కు.ని. శస్త్రచికిత్సల కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.
ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ
ఇదే అదనుగా కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు దోపిడీకి తెర లేపుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌కు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకూ వసూలు చేస్తున్నట్లు బాలింతలు వాపోతున్నారు. ప్రభుత్వాస్పత్రిలో అన్నీ ఉచితం కాగా.. ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్‌కు అయిన ఖర్చు కంటే ఆస్పత్రిలో ఉన్నందుకు అవుతున్న ఖర్చులు తడిపి మోపెడవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. దీంతో, అప్పులు చేసుకుని ఆపరేషన్లు చేయించుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు.


