అమలాపురం రూరల్: అమలాపురంలో జరిగిన కోనసీమ జిల్లా అండర్–9 చెస్ చాంపియన్ షిప్ పోటీల్లో అమలాపురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థినీ బి.శాన్వి ప్రథమ స్థానం, ఓపెన్ కేటగిరీ నుంచి మోక్స్ సైనీ తృతీయ స్థానాలు కై వసం చేసుకున్నారని కోచ్ వి.శ్రీనుబాబు సోమవారం తెలిపారు. వీరు వచ్చే నెల 18, 19 తేదీల్లో అన్నవరంలో జరిగే అండర్ –9 రాష్ట్ర స్థాయి చదరంగం పోటీల్లో పాల్గొనున్నారు. ఎనిమిదేళ్ల శాన్వి మొదటి స్థానం సాధించి జిల్లా చాంపియన్‌గా నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం హర్షించదగ్గ విషయమని పలువురు కొనియాడారు. చదువుతో పాటు చదరంగంలో రాణిస్తున్న విద్యార్థినులను స్కూల్ చైర్మన్ నాయుడు, డైరెక్టర్ పిన్సిపాల్ నంద్యాల మనువిహార్ అభినందించారు.


