త్రుటిలో తప్పించుకున్న వైనం
యానాం: స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్‌పై కొంతమంది దాడికి యత్నించడంతో త్రుటిలో ఆయన తప్పించుకున్నారు. తీర ప్రాంత మత్స్యకార గ్రామమైన సావిత్రినగర్‌కు ఓ పుట్టినరోజు కార్యక్రమానికి ఆయన వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి కారు వద్దకు వెళుతుండగా, ఒక్కసారిగా సుమారు 50 మంది రాళ్లు పట్టుకుని దాడికి యత్నించారని, దాని నుంచి త్రుటిలో తప్పించుకున్నానని ఎమ్మెల్యే అశోక్ విలేకరులకు తెలిపారు. తాను ముందస్తు అనుమతితో సావిత్రినగర్‌కు వెళ్లానని, అక్కడ ఉన్న ఎన్నికల అధికారి గొంతియ్యకు సైతం తెలిపానని, అయితే తనను గొంతియ్య ఏకపక్షంగా నువ్వు అంటూ సంబోధించడం ఎంతవరకు సబబు అని అన్నారు. ఇంటింటికీ ప్రచారానికి రాలేదని తెలిపానన్నారు. అయితే ఇదే అదనుగా కొంతమంది ఒక్కసారి తన వైపునకు రాళ్లతో వచ్చారని, మరోవైపు తన అనుయాయులు ఆపినప్పటికీ ముందుకు రావడంతో తాను కారులో తిరిగి యానాంకు వచ్చేశానన్నారు. తనపై ఎన్ని దౌర్జన్యాలకు దిగినా తనదే విజయమని ఆయన అన్నారు. ఘటనపై పుదుచ్చేరి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు.


