ఆత్రేయపురం: ప్రసిద్ధి గాంచిన ర్యాలీ జగన్మోహినీ కేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు సోమవారం ఆలయ అర్చక స్వాములు ప్రత్యేక పూజలు, సేవలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, తులసి పూజ, అమ్మవారికి కుంకుమార్చనలు, నిత్య ఉపాసన, బలిహరణ, నీరాజన మంత్ర పుష్పాలు, వేద పారాయణ అనంతరం పెద్ద సంఖ్యలో భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. అనంతరం కరప కళాకారుల బృందంచే సుందరకాండ, తోలు బొమ్మలాట ప్రదర్శన నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ చైర్మన్ మెర్ల నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు, ఆలయ ఈఓ భాగవతుల వెంకటరమణమూర్తి పర్యవేక్షించారు. హైదరాబాద్‌కు చెందిన వెంకట మహాదేవ కుమార్ దంపతులు రూ.5,116, కాకినాడ వాస్తవ్యులు గంగరాజు దంపతులు రూ.5,116 విరాళం సమర్పించారు. దాతలకు స్వామివారి ఫొటోలను సిబ్బంది అందజేశారు.
ర్యాలిలో జగన్మోహినీ కేశవస్వామి


