పట్టువస్త్రాలు సమర్పిస్తున్న మాజీ ఎంపీ అనురాధ, మాజీ మంత్రి ఆర్‌కే రోజా
సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం నిర్వహిస్తున్న పండితులు
అల్లవరం: దేవగుప్తంలోని ఉమా పార్వతీ సమేత మల్లేశ్వరస్వామివారి ఆలయంలో ఐదు రోజులుగా నక్షత్ర నవగ్రహ శివపంచాయతన సుబ్రహ్మణేశ్వర యాగం అత్యంత వైభవంగా జరుగుతోంది. చివరి రోజు మంగళవారం వల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణేశ్వరస్వామి వారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. వేద పండితులు పోచినపెద్ది శ్యామ్‌శర్మ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యాగానికి మాజీ మంత్రి ఆర్‌కే రోజా, మాజీ ఎంపీ చింతా అనురాధ విచ్చేశారు. వారికి పండితులు వేద మంత్రాలతో ఘనంగా స్వాగతం పలికారు. భీమవరం వాస్త వ్యులు వారణాసి సేతు మాధవ లక్ష్మీనరసింహమూర్తి వారిచే జరిగిన సుబ్రహ్మణేశ్వర స్వామివారి కల్యాణానికి పట్టువస్త్రాలను రోజా, అనురాధ అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు వంటెద్దు వెంకయ్య నాయుడు, తిక్కా ప్రసాద్, సత్యం కాపు, అంబికా శ్రీను, బసవా అనిల్ పాల్గొన్నారు.


