శెట్టిబలిజల సంస్కర్త దొమ్మేటి | - | Sakshi
Sakshi News home page

శెట్టిబలిజల సంస్కర్త దొమ్మేటి

Mar 24 2026 8:05 AM | Updated on Mar 24 2026 8:05 AM

ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు,

మాజీ ఎంపీ అనురాధ

అమలాపురం టౌన్‌: శెట్టిబలిజ సామాజిక వర్గ సంఘ సంస్కర్తగా దొమ్మేటి వెంకటరెడ్డి చేసిన కృషి చిరస్మరణీయమని ఎమ్మెల్సీ, ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ మహానాడు కన్వీనర్‌ కుడుపూడి సూర్యనారాయణరావు, వైఎస్సార్‌ సీపీ జోన్‌–2 మహిళా విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎంపీ చింతా అనురాధ అన్నారు. దొమ్మేటి జయంతి సందర్భంగా స్థానిక హైస్కూలు సెంటర్‌లో సోమమవారం వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో వారు మాట్లాడారు. తొలుత ఆ సెంటర్‌లో గల వెంకటరెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. శెట్టిబలిజల సామాజిక వర్గానికి ఆ పేరు రావడానికి ఆయన చేసిన కృషిని వివరించారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, పార్టీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, పార్టీ ఎస్‌ఈసీ సభ్యుడు కుడుపూడి భరత్‌ భూషణ్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు సంసాని చంద్రశేఖర్‌ (బులి నాని), రూరల్‌ మండల పార్టీ అధ్యక్షుడు గుత్తుల చిరంజీవిరావు, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రెడ్డి సత్య నాగేంద్రమణి, కోనసీమ శెట్టిబలిజ సంఘం అధ్యక్షుడు మట్టపర్తి మీరా సాహెబ్‌ శెట్టి, పార్టీ మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు షేక్‌ అబ్దుల్‌ ఖాదర్‌, మాజీ మున్సిపల్‌ కౌన్సిలర్లు చిట్టూరి పెదబాబు, దొమ్మేటి రాము, సంసాని శ్యామలాదేవి, పార్టీ నాయకులు వాసర్ల సుబ్బారావు, చెల్లుబోయిన నాని, అంబికా శ్రీను, దొంగ చిన్న తదితరులు దివంగత వెంకటరెడ్డి శెట్టిబలిజీలకు చేసిన సేవలను, త్యాగాలను గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement