● రన్నర్‌గా నిలిచిన యశ్వంత్
● ముగిసిన పవర్ లిఫ్టింగ్ పోటీలు
అమలాపురం రూరల్: ఉమ్మడి గోదావరి జిల్లాల స్ట్రాంగ్ మెన్ విన్నర్‌గా అమలాపురానికి చెందిన ఎం.వీరేంద్ర, రన్నర్‌గా యశ్వంత్ గెలుపొందారు. హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ ఆధ్వర్యంలో ఈదరపల్లిలో జనహిత కార్యాలయంలో జరిగిన పోటీలు సోమవారంతో ముగిసాయి. పోటీలలో 206 మంది సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్స్ విభాగాల్లో పోటీ పడగా అమలాపురం హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్‌కు చెందిన వీరేంద్ర 690 కేజీల బరువును ఎత్తి స్ట్రాంగ్ మెన్‌గా నిలిచారు. యశ్వంత్ 570 కేజీల బరుఎత్తి రన్నర్‌గా గెలుపొందారు. ఏప్రిల్ 3, 4, 5 తేదీల్లో విజయనగరం జిల్లా రాజాంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా నుంచి 24 మందిని జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్టు కోచ్ వెంకటేశ్వరరావు తెలిపారు. విజేతలు జూనియర్ విభాగంలో 59 కేజీల భాగంలో శ్రీరామ్ (కాకినాడ), 66 కేజీల విభాగంలో కె.ఎస్.మణికంఠ (రామచంద్రపురం), 74 కేజీల విభాగంలో బి.యశ్వంత్ (అమలాపురం), 83 కేజీల విభాగంలో పి.భానుచంద్ర (కాకినాడ), ప్లస్ 83 కేజీల విభాగంలో కె.సుధీర్ (శివకోడు), సీనియర్స్ విభాగంలో 59 కేజీల విభాగంలో ఎన్.గణేష్ (ఏలూరు), 66 కేజీల విభాగంలో ఎన్.వెంకటేశం (అమలాపురం), 74 కేజీల విభాగంలో కె.బాల కిషోర్ (రామచంద్రపురం), 83 కేజీల విభాగంలో ఎం.వీరేంద్ర (అమలాపురం), ప్లస్ 83 కేజీల విభాగంలో బి.పెద్దిరాజు (కలిదిండి) గెలుపొందారు. కోనసీమ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రెటరీ వంటెద్దు వెంకన్న నాయుడు, బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గారపాటి చంద్రశేఖర్, ఒలింపిక్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ సెక్రటరీ పప్పుల శ్రీరామ్ చంద్రమూర్తి విజేతలకు బహుమతులు అందచేశారు.


