ఐదుగురు పోలీస్‌ అధికారులకు సేవా పతకాలు | - | Sakshi
Sakshi News home page

ఐదుగురు పోలీస్‌ అధికారులకు సేవా పతకాలు

Mar 18 2026 11:18 AM | Updated on Mar 18 2026 11:18 AM

17ఎఎంపీ17

కడలి సత్యనారాయణ, అమలాపురం రూరల్‌ పోలీస్‌ సర్కిల్‌ ఏఎస్‌ఐ

అమలాపురం టౌన్‌: విధి నిర్వహణలో నిబద్ధత, సమర్థత, అంకిత భావంతో పనిచేస్తున్న జిల్లాకు చెందిన ఐదుగురు పోలీస్‌ అధికారులకు ఉగాది పురస్కారాల పేరుతో సేవా పతకాలను ప్రభుత్వం ప్రకటించింది. పోలీస్‌ శాఖలో స్మార్ట్‌ పోలీసింగ్‌ విధానం ద్వారా వీరిని ఎంపిక చేసింది. ఆగస్టు 15న అమరావతిలో జరిగే స్వాతంత్య్ర వేడుకల వేదికపై పతకాలను ప్రభుత్వం ప్రదానం చేయనుంది. అమలాపురంలోని జిల్లా ఆర్మ్‌డ్‌ రిజర్వుడు శాఖలో రిజర్వు ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ)గా పనిచేస్తున్న నేకూరి బ్రహ్మానందం, ఎస్పీ కార్యాలయంలో డీసీఆర్‌బీ ఎస్సైగా పనిచేస్తున్న త్రిపురాన ప్రసాదరావు, అమలాపురం రూరల్‌ పోలీస్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఎస్సైగా పనిచేస్తున్న కడలి సత్యనారాయణ, అమలాపురం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న వంగా వీర వెంకట సత్యనారాయణ, జిల్లా ఆర్మ్‌డ్‌ రిజర్వు విభాగంలో ఏఆర్‌ఎస్సైగా పనిచేస్తున్న ఉప్పాటి చిన్నిలకు ఈ సేవా పతకాలను ప్రభుత్వం ప్రకటించింది. వీరిని ఎస్పీ రాహుల్‌ మీనా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement