జాయింట్ కలెక్టర్ నిషాంతి
అమలాపురం రూరల్: మత సామరస్యం, ఆత్మీయతకు ప్రతీక ఇఫ్తార్ విందు అని జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. మంగళవారం సత్యనారాయణ గార్డెన్‌లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పౌరసరఫరాల అధికారి ఉదయభాస్కర్, సీపీఓ మురళీకృష్ణ, ఎల్ ఎల్‌డీఎం కేశవవర్మ, జిల్లా టూరిజం అధికారి అన్వర్, వికాస జిల్లా మేనేజర్ రమేష్ పాల్గొన్నారు.
గాలికుంటు వ్యాధిని 2030 నాటికి నియంత్రించాలి
గాలికుంటు వ్యాధిని 2030 నాటికి పూర్తిగా నియంత్రించాలనే లక్ష్యంతో వ్యాధి నివారణ టీకాలు ఏడాదిలో రెండుసార్లు క్రమం తప్పకుండా వేస్తున్నట్లు జేసీ టి.నిషాంతి తెలిపారు. గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల వాల్‌పోస్టర్‌ను జేసీ మంగళవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ టీకాల కార్యక్రమాన్ని ఏప్రిల్15 వరకు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ కె.భవానీప్రసాద్ మాట్లాడుతూ ప్రతి పాడి పశువుకూ 4 నెలలు నిండిన దూడ దగ్గర నుంచి అన్ని వయసుల్లో ఉన్న ప శువులకూ ఈ టీకాలను ప్రభుత్వం ఉచితంగా వేస్తుందనివెల్లడించారు. డాక్టర్‌ఎల్.విజయరెడ్డి పాల్గొన్నారు.


