సాక్షి, అమలాపురం: తిరుపతి గ్రాండ్ రిడ్జ్ హోటల్ వద్ద టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా డిమాండ్‌తో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వైఎస్సార్ సీపీ మహిళా నేతలపై జరిగిన అమానుష దాడిని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబీ) తీవ్రంగా ఖడించారు. దాడికి నిరసనగా పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం అమలాపురంలోనిని ఈదరపల్లి వంతెన వద్ద వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. దాడికి పాల్పడటమే కాకుండా బాధితులైన మహిళా నేతలపైనే తప్పుడు కేసులు పెట్టడం ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట అన్నారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం ప్రతినిధులు, సభ్యులు పాల్గొని నిరసననువిజయవంతం చేయాలని బాబీ పిలుపునిచ్చారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 33 అర్జీలు
అమలాపురం టౌన్: స్థానిక ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 33 అర్జీలు వచ్చాయి. ఎస్పీ రాహుల్ మీనా, ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్ తమ చాంబర్ల నుంచి ఈ పోలీస్ గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు వచ్చారు. అర్జీదారులతో ఎస్పీ, ఏఎస్పీలు ముఖాముఖీ మాట్లాడి వారి సమస్యలపై చర్చించారు. వచ్చిన అర్జీల్లో కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి.
పాలనలో పారదర్శకత అవసరం
అమలాపురం రూరల్: పరిపాలనలో వేగం, పార దర్శకత ఉన్నప్పుడే సామాన్య ప్రజలకు ప్రభుత్వ ఫలాలు సకాలంలో అందుతాయని జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయభాస్కర్ అన్నా రు. సోమవారం కలెక్టరేట్‌లో ఈ–ఆఫీస్ ఫైళ్ల పరి ష్కారంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన జేసీ నిషాంతిని జిల్లా యంత్రాంగం సత్కరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి
ప్రతి వినియోగదారుడు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకున్న ప్పుడే మోసాలను అరికట్టడం సాధ్యమవుతుందని జేసీ నిషాంతి అన్నారు. కలెక్టరేట్‌లో వినియోగదారుల హక్కుల దినోత్సవం ఆమె అధ్యక్షతన నిర్వహించారు.


