సరఫరా కావడం లేదు | - | Sakshi
Sakshi News home page

సరఫరా కావడం లేదు

Mar 17 2026 7:46 AM | Updated on Mar 17 2026 7:46 AM

కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల సరఫరాను ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో కేటరింగ్‌ అండ్‌ కుకింగ్‌ నిర్వాహకులు, హోటళ్ల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్‌ లేక కొంతమంది వంటలు చేయడం నిలిపివేశారు. దీంతో పనులు లేక కార్మికులు, వ్యాపారులు, హోటళ్ల యాజమానులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం హాటళ్లకు గ్యాస్‌ సరఫరా చేయకుంటే మూతపడే ప్రమాదం ఉంది.

– సలాది సూరిబాబు, జిల్లా అధ్యక్షుడు, కోనసీమ కేటరింగ్‌ అండ్‌ కుకింగ్‌ సంఘం, అమలాపురం

ఆందోళన వద్దు

డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్ల సరఫరా జరుగుతుంది. వినియోగదారులు ఆందోళన చెందవలసిన అవసరంలేదు. సిలిండర్ల డెలివరీ విషయంలో ఏవైనా ఇబ్బంది కలిగిస్తే అధికారులకు ఫిర్యాదు చేయండి. లేదా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌కు ఫిర్యాదు చేయాలి. జిల్లాలో హోటళ్లపై దాడులు చేసి 28 సిలిండర్లను స్వాధీనం చేసుకొని 6ఏ కేసులు నమోదు చేశాం.

– అడపా ఉదయ భాస్కరరావు,

డీఎస్‌వో, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement