ట్యూనా.. చూడముచ్చటేనా! | - | Sakshi
Sakshi News home page

ట్యూనా.. చూడముచ్చటేనా!

Mar 1 2026 7:35 AM | Updated on Mar 1 2026 7:35 AM

 ట్యూ

ట్యూనా.. చూడముచ్చటేనా!

లోతైన సముద్ర జలాల్లో లభ్యమయ్యే ట్యూనా చేపల వేటకు కాకినాడ ప్రసిద్ధి. ఇక్కడ మత్స్యకారులు వలలతో పాటు గాలం కమ్మెల ద్వారా ఈ చేపలను వేటాడతారు. ప్రస్తుతం గాలం ద్వారా ఎల్లోపిన్‌ రకం ట్యూనా చేపలు లభ్యమవుతుండడంతో వాటిని కాకినాడలో విక్రయిస్తున్నారు. కుంభాభిషేకం వద్ద వీటి ధర కిలో రూ.130 వరకూ పలుకుతోంది. శనివారం విక్రయం కోసం మత్స్యకారులు ఇలా ఉంచారు. ఈ చేపలకు విదేశాల్లో మంచి కిరాకీ ఉంది.

–కాకినాడ రూరల్‌

అపురూపం అమ్మా..

మురమళ్లలో భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామివారి ఆలయంలో మాణిక్యాంబ అమ్మవారిని వివిధ రకాల పండ్లతో ప్రత్యేకంగా అలంకరించారు. శివరాత్రి నుంచి మొదలై ఉగాది వరకూ ఇక్కడ జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం పండ్లతో అమ్మవారిని అలంకరించారు. పుచ్చకాయలు, స్వీట్‌కార్న్‌ మొక్క జొన్న, ద్రాక్ష, కమలా ఫలాలతో అలంకరణ విశేషంగా ఆకర్షించింది.

–ఐ.పోలవరం

ఆనప కాదు మారేడు

పోతవరంలో పిచ్చుకల సత్తిబాబు (సత్యనారాయణ) వ్యవసాయ క్షేత్రంలో మారేడు చెట్టుకు కాసిన కాయలు అబ్బురపరుస్తున్నాయి. వీటిని ఆ గ్రామానికి చెందిన యేలేటి రాజశేఖర్‌ తీసుకువచ్చారు. సాధారణంగా మారేడు చెట్టుకు చిన్నసైజు కాయలు కాయడం చూస్తుంటాం. కానీ ఆనబకాయ సైజులో ఐదు కిలోల నుంచి తొమ్మిది కిలోల వరకూ ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

–నల్లజర్ల

పోతవరంలో కాసిన

మారేడు కాయలు

పండ్లతో మాణిక్యాంబ

అమ్మవారికి అలంకరణ

 ట్యూనా.. చూడముచ్చటేనా!  
1
1/2

ట్యూనా.. చూడముచ్చటేనా!

 ట్యూనా.. చూడముచ్చటేనా!  
2
2/2

ట్యూనా.. చూడముచ్చటేనా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement