రీల్స్ చూపిస్తా మామ..
ఆంక్షలున్నా బేఖాతర్..
జిల్లాలో కోడి పందేలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఐ.పోలవరం, అల్లవరం, మలికిపురం, రాజోలు, సఖినేటిపల్లి, మామిడికుదురు, ఆత్రేయపురం మండలాల్లో పందేలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మిగిలిన మండలాల్లో కూడా పందేలు జరగనున్నాయి. టీడీపీ, జనసేన నాయకులు పందేల బరుల కోసం పైరవీలు మొదలు పెట్టారు. పోలీసులు అధికారికంగా అనుమతులు ఇవ్వకున్నా పండగ మూడు రోజులు చూసీచూడనట్టు వదిలేసేలా చూడాలని, బరులకు అనధికార అనుమతులు ఇప్పించాలని ఒత్తిడి పెంచారు. బరులు ఏర్పాటు చేసే ప్రాంతాలను గుర్తించారు. ఒకటి, రెండు రోజుల్లో ఆయా ప్రాంతాలను చదును చేసి పందేల నిర్వహణకు అనుగుణంగా తీర్చిదిద్దనున్నారు. కోడి పందేలతోపాటు ఈ ఏడాది గుండాటలు కూడా పెద్ద ఎత్తున సాగే అవకాశముంది. పందేల బరుల వద్దే గుండాటలను కూడా నిర్వహించనున్నారు. ఈ తంతుపై పోలీసులు ఎలా స్పందిస్తారనేది ప్రశ్నార్ధకమైంది.
ఫ కోడి పందేలపై అధికార పార్టీ నేతల ప్రచారం
ఫ ‘అలా మురమళ్ల’ పేరుతో వీడియోలు
ఫ సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు
ఫ పోలీసుల హెచ్చరికలు బేఖాతర్
ఐ.పోలవరం: ‘అలా మురమళ్లలో..’ అంటే అదేదో సినిమా పేరు అనుకుంటారు. అసలు కాదండోయ్.. ఇది అధికార టీడీపీ నేతల ఆధ్వర్యంలో జరిగే కోడి పందేలకు చేసిన రీల్స్.. సంక్రాంతి సమీపిస్తుండడంతో జూదరులను ఆకర్షించేందుకు ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతున్నాయి. కోడి పందేలను అడ్డుకుంటామనే పోలీస్ హెచ్చరికలు బేఖాతర్ చేస్తూ, పందేల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. గతంలో సంక్రాంతి పండగ ముందు రోజు వరకూ పందేల నిర్వహణ, బరులు సిద్ధం చేయడాన్ని రహస్యంగా ఉంచేవారు. ప్రభుత్వం మారిన తరువాత వారం పది రోజుల ముందు నుంచే కోడి పందేలకు సన్నాహాలు మొదలు పెట్టేశారు. ఇది సరిపోదన్నట్టు ఈ ఏడాది ఒక అడుగు ముందుకు వేసి, సామాజిక మాధ్యమాల్లో ప్రచారానికి తెరదీశారు. కోడి పందేల బరులతో రీల్స్ చేసి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌లలో పందేల రీల్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ఇలా పందేల కోసం బహిరంగంగానే ప్రచారం మొదలు పెట్టారు. కోడి పందేల బరులు, వాటి చుట్టూ ఏర్పాటు చేసిన గ్యాలరీలు, ఎల్‌సీడీలు, కార్ పార్కింగ్‌లు.. ఇలా సర్వం రీల్స్‌లో చూపిస్తూ జూదరులను ఆకర్షిస్తున్నారు.
రీల్స్ చూపిస్తా మామ..
రీల్స్ చూపిస్తా మామ..
రీల్స్ చూపిస్తా మామ..


