భీమేశ్వరాలయంలో మరో అపచారం
ఫ కారకులపై చర్యలు తీసుకోండి
ఫ మాజీ ఎమ్మెల్యే
మల్లాది విష్ణు
రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయంలో అత్యంత పురాతన కపాలేశ్వరస్వామి శివలింగాన్ని ముక్కోటి ఏకాదశి నాడు ధ్వంసం చేస్తే ఈ అప్రతిష్ట నుంచి బయట పడాలన్న తొందరపాటులో ఆలయ అధికారులు, స్థానిక నాయకులు మరో ఘోర అపచారానికి పాల్పడ్డారని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ఇటువంటి అపచారానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏడాది డిసెంబర్ 30వ తేదీ మంగవారం తెల్లవారు జామున 1.30 ప్రాంతంలో ఒక దుండగుడు సుత్తితో ప్రాచీన కపాలేశ్వరస్వామి శివలింగాన్ని ధ్వంసం చేశాడు (పోలీసుల కథనం ప్రకారం). ఉదయం 6.30 గంటలకు స్థానిక అయ్యప్ప స్వాములు శివలింగం ధ్వంసం అయిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తెచ్చారు. ఆ తరువాత స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం కూటమి నాయకులతో కలసి మధ్యాహ్నం వరకూ ఆలయం వద్దనే ఉండి ఈ అప్రతిష్ట అటు ప్రభుత్వానికి, ఇటు స్థానిక నాయకత్వానికి చెడ్డపేరు రానివ్వకూడదనే తొందరపాటులో శూన్య మాసమని, మూఢం చూడకుండా సరైన పండితులతో చర్చించకుండా కంగారుగా శివలింగం ప్రతిష్ఠ చేశారన్నారు. సూర్యస్తమయం కాకుండా శివలింగం ప్రతిష్ఠ చేయాలనే కృత్రిమ తొందరపాటును కల్పించి హడావుడి చేసి ప్రతిష్ఠ చేసేశారన్నారు. అయితే వారు చెప్పిన దాని ప్రకారమే చూసినా ఆ రోజు సూర్యాస్తమయం భీమేశ్వరాలయ పంచాంగం ప్రకారం సాయంత్రం 5.30 గంటలకు ఉండగా, 5.39 గంటల వరకు స్వామివారి పానుపట్టం ఖాళీగానే ఉన్న ఫోటో, అదేవిధంగా 5.40 గంటలకు శివలింగాన్ని పానుపట్టంపై అమర్చిన ఫోటోలు బయట పడటంతో వారు ఎంతటి అపచారానికి పాల్పడ్డారనేది తేటతెల్లం అయ్యిందన్నారు. మంత్రి సుభాష్ అనుచరులు 5.15 గంటలకే శివలింగ ప్రతిష్ఠ పూర్తి చేశామని, ప్రజలను పక్కదోవ పట్టించాల ని చూశారన్నారు. శివలింగ ప్రతిష్ఠ ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా జరిగిందనేది విస్తృతంగా ప్రచారం అవుతోందన్నారు. దీంతో హిందువులు అయోమయానికి గురవుతున్నారన్నారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ము డిపడిన అంశం కావడంతో మొత్తం సంఘటనపై జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భీమేశ్వరాలయంలో మరో అపచారం
భీమేశ్వరాలయంలో మరో అపచారం


