మాది మధ్య తరగతి కుటుంబం. మా నాన్న లారీ డ్రైవర్, తల్లి గృహిణి. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఇంజినీర్ కావాలనే ఆశయంతో చదువుకున్నాను. ఎంసెట్‌లో మంచి ర్యాంకు వచ్చినా ప్రభుత్వ కళాశాలలో సీటు రాలేదు. కౌన్సెలింగ్ ద్వారా అమలాపురం మండలం భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ విభాగంలో సీటు వచ్చింది. ప్రైవేట్ కాలేజీలో ఇంజినీరింగ్ విద్య అంటే మా కుటుంబం భయపడింది. ఎక్కువ ఫీజులు కట్టగలమా అని ఆందోళన చెందారు. కాని అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ వల్ల బీటెక్ సాఫీగా పూర్తి చేశాను. జగన్ ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఓ సారి సకాలంలో ఫీజు రీయింబర్స్ చేసింది. వాటిని మా అమ్మ ఖాతాలో వేయడం వల్ల ఆ డబ్బులు కాలేజీకి చెల్లించి బీటెక్ పూర్తి చేశాను. చదవలేననుకున్న బీటెక్ పూర్తి చేయడమే కాదు.. బెంగళూరు కేంద్రంగా అమెజాన్ మల్టీ నేషనల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా కూడా ఉద్యోగం చేస్తున్నాను. జగన్ ప్రభుత్వం అమలు చేసిన ఫీజు రీయింబర్స్‌మెంట్ వల్ల నాలా చాలా మంది పేద కుటుంబాల వారు ఇంజినీరింగ్, మెడిసిన్ పూర్తి చేశారు. దీనికి నా తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉండడం కలసి వచ్చింది. జగన్ మరిన్ని పుట్టిన రోజులు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
– అలెగ్జాండర్, ఎ.వేమవరం, అమలాపురం మండలం


