జాతీయ కోకో పోటీలకు లావణ్యశ్రీ
అంబాజీపేట: తొండవరం జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్న సవరపు లావణ్యశ్రీ జాతీయ ఖోఖో పోటీలలో పాల్గొననున్నట్టు హెచ్‌ఎం పీవీ కేశవాచార్యులు, పీడీ పెచ్చెట్టి సూర్యనారాయణ తెలిపారు. గత నెల విజయనగరంలో జరిగిన అండర్–19 బాలికల ఖోఖో రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల పోటీల్లో లావణ్యశ్రీ పాల్గొందన్నారు. ఈ పోటీలలో ఆమె అత్యంత ప్రతిభ కనబర్చి ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున జాతీయ పోటీలకు ఎంపికై ందన్నారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఈ నెల 22 నుంచి 27 వరకు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఆమె పాల్గొననుందన్నారు. లావణ్యశ్రీని పలువురు అభినందించారు.


