పిల్లలకు స్క్రీనింగ్ పరీక్షలు
కాకినాడ క్రైం: స్థానిక జీజీహెచ్‌లో చీలిక పెదాలు, అంగిలి సవరణ చికిత్సా శిబిరం శనివారం ప్రారంభమైంది. మిషన్ స్మైల్ ఇండియా ఫినాలెక్స్, ముకుల్ మహదేవ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ శిబిరాన్ని సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి ప్రారంభించారు. బాధిత బాలల్ని గుర్తించేందుకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ప్లాస్టిక్ సర్జరీ హెచ్‌ఓడీ డాక్టర్ రత్నభూషణ్ పర్యవేక్షణలో అనస్తీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రతాప్, డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ వైద్యులు శిశిర్‌రెడ్డి, రేఖాదేవి ఆధ్వర్యంలో చేపట్టారు. మొత్తం 66 మంది బాలలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు.


