ఐహెచ్‌ఆర్‌సీ ఉపాధ్యక్షుడిగా బిషప్ డాక్టర్ థామస్
నియామక పత్రం అందచేసిన జాతీయ అధ్యక్షుడు
సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్(ఐహెచ్‌ఆర్‌సీ) భారతదేశ ఉపాధ్యక్షుడిగా బిషప్ డాక్టర్ అరుల్ థామస్ సెల్వనాథన్ నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కుందవరం రాజానందన్ విజ్ఞాన్ ఢిల్లీలో అందచేశారు. కొన్నేళ్లుగా మానవ హక్కులకు సంబంధించి డాక్టర్ థామస్ విశేషమైన సేవలను అందిస్తున్నారు. ఐహెచ్‌ఆర్‌సీ తరఫున ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ మానవ హక్కులపై ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. ఇందుకు గాను ఇండియన్ చాప్టర్ (దేశ) ఉపాధ్యక్షుడిగా డాక్టర్ థామస్‌ను నియమించారు. ఈ పదవి తనకు మరింత బాధ్యతను పెంచిందని డాక్టర్ థామస్ పేర్కొన్నారు.


