
కార్యకర్తలకు అండగా డిజిటల్ బుక్
మాజీమంత్రి గొల్లపల్లి, ఎమ్మెల్సీ కూడుపూడి
అమలాపురం రూరల్: కూటమి ప్రభుత్వం నడుపుతున్న రెడ్ బుక్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కార్యకర్తలకు అండగా ఉండేందుకు డిజిటల్ బుక్‌ను ప్రారంభించారని రాజోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. మండలం భట్నవిల్లిలో మాజీ మంత్రి విశ్వరూప్ నివాసంలో శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతోందన్నారు. వాటి నుంచి పార్టీ శ్రేణులను కాపాడుకునేందుకు జగన్ డిజిటల్ బుక్ ప్రారంభించారన్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్‌చేసి కార్యకర్తలు తమ ఇబ్బందులపై ఫిర్యాదు చేస్తే వారికి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. db.weysrcp.com లోకి వెళ్లి కార్యకర్త ఫోన్ నంబర్‌ను టైప్ చేయగానే ఓటీపీ వస్తుందన్నారు. తర్వాత వివరాలు పూర్తి చేసి అన్యాయానికి సంబంధించి డాక్యుమెంట్లు, వీడియోలు అప్‌లోడ్ చేస్తే డిజిటల్ బుక్‌లో స్టోర్ అవుతాయన్నారు. ఐవీఆర్ విధానం ద్వారా 040–49171718 టెలిఫోన్ నంబర్‌కు కాల్ చేసిన తర్వాత ఫిర్యాదు ఎలా చేయాలన్నదానిపై గైడెన్స్ ఇస్తూ పూర్తి చేస్తుందన్నారు. ఎమ్మెల్సీ కూడుపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు శ్రీరామరక్షగా డిజిటల్ బుక్ నిలుస్తుందన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక డిజిటల్ బుక్‌లో నమోదైన కేసులపై దర్యాప్తు చేయించి న్యాయం చేస్తామన్నారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన అధికారులు రిటైర్ అయినా, ఎక్కడ ఉన్నా చట్టం ముందు నిలబెడతామని జగన్ హామీ ఇచ్చారన్నారు. పి.గన్నవరం కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 16 నెలల కాలంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారన్నారు. తొలిత డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్లను గొల్లపల్లి, ఎమ్మెల్సీ సూర్య నారాయరావు, పార్టీ నామయకులు అవిష్కరించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, పితాని బాలకృష్ణ, కర్రి పాపారాయుడు, పాటి శివకుమార్, మహిళ విభాగం అధికారి ప్రతినిధి కాశి బాలమునికుమారి, మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు సంసాని బులి నాని, బద్రి బాబ్జీ, జెడ్పీటీసీలు పందిరి శ్రీహరిరామ్‌గోపాల్, కొనుకు గౌతమి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖాదర్, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి ఉండ్రు బాబ్జీ, బూత్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి ఉండ్రు వెంకటేష్, మున్సిపల్ విభాగం సంయుక్త కార్యదర్శి గొవ్వాల రాజేష్, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు దొమ్మేటి సత్యమోహన్, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు తొరం గౌతమ్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు మిండగుదిటి శిరీష్, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కటకంశెట్టి ఆదిత్యకుమార్, ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి గుత్తుల ఈశ్వర ప్రసాద్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శులు చింతా రామకృష్ణ, పొగాకు శ్రీను, ఒంటెద్దు వెంకయ్యనాయుడు, కూడుపూడి భారత్ తదితరులు పాల్గొన్నారు.