
వాడపల్లి.. జనసంద్రం
● భక్తులతో పోటెత్తిన వేంకన్న క్షేత్రం
● మార్మోగిన గోవింద నామస్మరణ
● ఒక్కరోజు ఆదాయం రూ––లక్షలు
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ఖ్యాతికెక్కిన వాడపల్లి క్షేత్రానికి శనివారం భక్తజనం పోటెత్తారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవీ, భూదేవి సమేత వేంకటేశ్వరుని క్షేత్రానికి తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలైంది. శుక్రవారం రాత్రి నుంచే ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల నుంచి భక్తులు కాలినడకన వాడపల్లికి చేరుకున్నారు. సాధారణ భక్తులతో పాటు అత్యధిక సంఖ్యలో శ్రీఏడు శనివారాలు – ఏడు ప్రదక్షిణలశ్రీ నోము ఆచరిస్తున్న భక్తులతో ఆ క్షేత్రం నిండిపోయింది. పలువురు భక్తులు మోకాళ్లపై ప్రదక్షిణలు చేశారు. గోవింద నామస్మరణతో వాడపల్లి క్షేత్రం మార్మోగింది. ఆలయ ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితుల బృందం విశేష పూజలు చేసి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అత్యధిక సంఖ్యలో భక్తులు అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించారు. వివిధ సేవల ద్వారా దేవస్థానానికి రూ – ఆదాయం వచ్చినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎస్సై రాము పోలీస్ సిబ్బందితో ప్రత్యేక పోలీసు బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా క్రమబద్ధీకరించారు.
వాడపల్లి క్షేత్రం ఉచిత వైద్య శిభిరంలో భక్తుని యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్న
డీసీ అండ్ ఈఓ చక్రధరరావు

వాడపల్లి.. జనసంద్రం