
హోం స్టే టూరిజంతో ఉపాధి మెరుగు
● కలెక్టర్ మహేశ్‌కుమార్
మలికిపురం: టూరిజంలో హోమ్ స్టే విధానాన్ని అమలు చేయడం ద్వారా గ్రామీణులకు కొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నట్లు కలెక్టర్ ఆర్.మహేశ్ కుమార్ పేర్కొన్నారు. తూర్పుపాలెంలో ఎంపిక చేసిన అడబాల వీరన్న మండువా ఇంటిని శనివారం ఆయన పరిశీలించి ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వారా వెబ్‌సైట్‌కు అనుసంధానించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ హోమ్ స్టే టూరిజం అభివృద్ధికి తొలి విడతగా రాష్ట్రంలో ఎంపిక చేసిన నాలుగు కేంద్రాలలో కోనసీమ జిల్లా ఒకటన్నారు. ఈ మేరకు జిల్లాలో 145 మండువా ఇళ్లను గుర్తించి రాష్ట్ర టూరిజం వెబ్‌సైట్‌లో పెట్టామని, టూరిస్టులు వాటిని చూసి ఆకర్షితులై ఆనాటి వాతావరణాన్ని అనుభూతి చెందే అవకాశం ఉంటుందన్నారు. తద్వారా ఇక్కడి ప్రజలకు ఆదాయం, ఉపాధి లభిస్తాయన్నారు. ఈ ప్రాంత సంస్కృతి, జీవనశైలిని అనుభూతి చెందే దిశగా ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రోత్సహిస్తోందన్నారు.