
ఊరేగింపులకు పటిష్ట బందోబస్తు
అమలాపురం టౌన్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరగనున్న దసరా ఉత్సవాల ఊరేగింపులకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. జిల్లా ప్రజలు దసరా ఉత్సవాలను స్నేహ పూర్వక వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఆయన తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ శాంతిభద్రతల విషయంలో ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్నీ సక్రమంగా జరిగేలా ఉత్సవ కమిటీ ప్రతినిధులే బాధ్యత తీసుకోవాలని ఆయన అన్నారు.
ఎల్‌హెచ్‌ఎంఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లాలో ఎవరైనా ఊళ్లకు వెళుతుంటే పోలీస్ శాఖను సంప్రదించి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్‌హెచ్‌ఎంఎస్) ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పోలీసులకు రిక్వెస్ట్ పెట్టుకుంటే సమీప పోలీసు స్టేషన్ నుంచి సిబ్బంది వచ్చి సీసీ కెమెరాలు బిగించి పోలీసు కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షిస్తుంటారని వివరించారు. తద్వారా ఇళ్లలో దొంగతనాలు నివారించవచ్చని అన్నారు.
ఎస్పీ రాహుల్ మీనా