
వృత్తి పన్ను సకాలంలో చెల్లించండి
అసిస్టెంట్ కమిషనర్ జగన్‌మోహన్‌రెడ్డి
అమలాపురం టౌన్: వాణిజ్య పన్నుల శాఖకు చెల్లించాల్సిన వృత్తి పన్నుపై వ్యాపారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ అమలాపురం సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్ ఎం.జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. స్థానిక ఏబీసీడీ ఫుడ్ కోర్టులో సర్కిల్ పరిధిలోని పలు వ్యాపార సంఘాల ప్రతినిధులు, వ్యాపారులు, టాక్స్ కన్సల్టెంట్లకు వృత్తి పన్ను చట్టంపై గురువారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రూ.10 లక్షల వార్షిక టర్నోవర్ దాటిన వ్యాపారులు ఆ మొత్తానికి తగ్గ పన్ను విధిగా చెల్లించాలని స్పష్టం చేశారు. స్పెషల్ ఏసీటీవోలు ఇళ్ల భక్తవత్సలరావు, ఎస్.శ్రీనివాసరెడ్డి, ఈవీఎస్‌ఎన్ ప్రసాద్ వృత్తిపన్ను చట్టంపై అవగాహన కల్పించాచారు. పన్నులను వ్యాపారులు సకాలంలో విధిగా చెల్లించి దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పట్టణ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ, బోణం సత్తిబాబు సదస్సులో మాట్లాడారు. చాంబర్ గౌరవ సలహాదారు కంచిపల్లి అబ్బులు, జిల్లా టాక్స్ కన్సల్టెంట్ల సంఘం అధ్యక్షుడు పీటీ వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి కె.శివకుమార్‌తో పాటు సీటీవో కార్యాలయ పరిధిలోని వ్యాపారులు పాల్గొన్నారు.
4 బార్లకు లాటరీ
అమలాపురం టౌన్: జిల్లాలో దరఖాస్తులు పడాల్సిన పది బార్లకు బుధవారం రాత్రి 7.30 గంటలు దాటిన తర్వాత నాలుగు బార్లకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు పడ్డాయి. బుధవారం రాత్రి 11.59 గంటల లోపు ఈ దరఖాస్తులు వచ్చాయి. అమలాపురంలోని గీత కులాల బార్‌కు, మండపేట మున్సిపాలిటీలో రెండు బార్లకు, దిండి రిసార్ట్స్ ఒక బార్‌కు నాలుగేసి దరఖాస్తులు రావడంతో లాటరీకి ఆ బార్లకు అర్హత వచ్చింది. ఈ నాలుగు బార్లకు అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం గోదావరి భవన్‌లో జిల్లా ఇన్‌చార్జి డీఆర్వో, అమలాపురం ఆర్డీవో కొత్త మాధవి సమక్షంలో గురువారం లాటరీ తీశారు. గతంలో రెండు విడతలుగా జరిగిన దరఖాస్తుల స్వీకరణలో అమలాపురంలో ఒక బార్‌కు, రామచంద్రపురం గీత కార్మికులకు కేటాయించిన బార్‌కు నాలుగేసి దరఖాస్తుల రావడంలో అవి లాటరీకి అర్హత సాధించాయి. మిగిలిన అయిదు బార్లకు దరఖాస్తులు రాలేదు. ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ రేణుక, జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ప్రసాద్ పర్యవేక్షణలో, డీఆర్వో మధవి సమక్షంలో ఈ లాటరీ జరిగింది.
కలెక్టర్‌ను కలిసిన ఎస్పీ మీనా
అమలాపురం టౌన్: ఇటీవల జిల్లా కొత్త ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ మీనా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్‌ను స్థానిక కలెక్టరేట్‌లో గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లాలోని శాంతి భద్రతలపై వారిరువురూ కొద్దిసేపు చర్చించుకున్నారు. కలెక్టర్‌కు ఎస్పీ పూల కుండీ అందజేశారు. ఎస్పీకి కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లాకు 22 వేల టన్నుల
యూరియా
మామిడికుదురు: కోనసీమ జిల్లాకు 22 వేల మెట్రిక్ టన్నుల యూరియా దిగుమతి అయినట్టు జిల్లా వ్యవసాయాధికారి బోసుబాబు తెలిపారు. గురువారం ఆయన స్థానిక సొసైటీలో చైర్మన్ ఈలి శ్రీనివాస్‌తో కలిసి యూరియా విక్రయాలను పరిశీలించారు. జిల్లాలో 1,56,565 ఎకరాల విస్తీర్ణంలో సార్వా సాగులో ఉందన్నారు. జిల్లాకు 16 వేల మెట్రిక్ టన్నులు యూరియా అవసరం కాగా దాని కన్నా అదనంగా యూరియా వచ్చిందన్నారు. మరో 500 మెట్రిక్ టన్నులు యూరియా వస్తోందని చెప్పారు.

వృత్తి పన్ను సకాలంలో చెల్లించండి

వృత్తి పన్ను సకాలంలో చెల్లించండి