
రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు దినేష్‌ప్రసా
అంబాజీపేట: రాష్ట్ర స్థాయి అండర్–17 వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ముక్కామల జెడ్పీ హైస్కూల్ 9వ తరగతి విద్యార్థి గుంట్రు దినేష్‌ప్రసాద్ ఎంపికై నట్లు హెచ్‌ఎం ఎంఎస్సార్ మూర్తి తెలిపారు. ఈ మేరకు దినేష్ ప్రసాద్‌ను పాఠశాలలో పలువురు గురువారం అభినందించారు. పీడీ ముత్యాల పవన్ కిశోర్ మాట్లాడుతూ ఇటీవల కాకినాడలో జరిగిన జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ అండర్–17 వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో 79 కేజీల విభాగంలో అతడు స్వర్ణ పతకం సాధించాడన్నారు. ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ బూడిద వరలక్ష్మి, సర్పంచ్ బండారు వెంకటలక్ష్మి, ఎస్‌ఎంసీ చైర్మన్ బి.శామ్యూల్‌రాజు, ఎంపీటీసీ వనచర్ల దుర్గాభవాని తదితరులు ప్రసాద్‌ను అభినందించారు.