
భజే గణనాయకా..
అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వర స్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో తెల్లవారు జామున స్వామివారికి మేలుకొలుపు సేవ, గరిక పూజ పూజ చేశారు. అనంతరం వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 60 మంది, పంచామృతాభిషేకాల్లో ఒక జంట, లక్ష్మీగణపతి హోమంలో 19 జంటలు, పంచామృతాభిషేకాల్లో ఇరువురు దంపతులు పాల్గొన్నారు. ఐదుగురు చిన్నారులకు అన్నప్రాశన, నలుగురికి తులాభారం నిర్వహించారు. 17 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 3,100 మంది స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ ఒక్కరోజే ఆలయానికి వివిధ విభాగాల ద్వారా రూ.2,44,843 ఆదాయం లభించినట్లు ఆలయ ఇన్‌చార్జ్ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.