
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ దారుణం
● రేపు కామనగరువులో ఆందోళన
● వైఎస్సార్ సీపీ యువజన విభాగం
జిల్లా అధ్యక్షుడు సూర్యప్రకాశ్
రామచంద్రపురం: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దారుణమని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పిల్లి సూర్య ప్రకాష్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలను ఏర్పాటుకు తలపెట్టి, ఐదు కళాశాలలను పూర్తి చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించడం దారుణమన్నారు. దీని వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య అందే అవకాశం లేకుండా పోతుందన్నారు. ఈ నేపథ్యంతో పార్టీ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం 9:30 గంటలకు అమలాపురం నియోజకవర్గంలోని కామనగరువులో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల వద్ద యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతున్నామన్నారు. కార్యక్రమానికి జిల్లా పార్టీ నాయకులు, సమన్వయకర్తలు, కార్యకర్తలు, యువజన నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, ప్రజా ప్రతినిధులు తరలిరావాలన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు పోలినాటి వర ప్రసాద్, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు మాదిరెడ్డి పృథ్వీ రాగ్, కె.గంగవరం మండలం యువజన విభాగం అధ్యక్షుడు మేడిశెట్టి గోవింద రాజు, రామచంద్రపురం టౌన్ యువజన విభాగం అధ్యక్షుడు సెలగాల మధు, నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు లంక నవీన్, ఎ.దొరబాబు పాల్గొన్నారు.
విజయవంతం చేయాలి
తాళ్లరేవు: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించనున్న చలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి వుంగరాల సంతోష్ అన్నారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. గతంలో 54 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసిన చంద్రబాబు.. ప్రస్తుతం మెడికల్ కళాశాలలను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారన్నారు.

వైద్య కళాశాలల ప్రైవేటీకరణ దారుణం