
ఆలమూరు
ఆలమూరు మండలం కొత్తూరు నుంచి వెదురుమూడి వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి అధ్వానంగా మారింది. పేరుకు రోడ్డు గానీ అన్నీ గోతులే. గోతులు పూడ్చిన రహదారిపై గోతులు పడ్డాయి. వర్షం కురిసి రోడ్డు మునిగితే ఎక్కడ గొయ్యి ఉందోకూడా తెలియని పరిస్థితి నెలకొంది.
అయినవిల్లి
అయినవిల్లి మండలం ముక్తేశ్వరం నుంచి కె.జగన్నాథపురం మీదుగా ముమ్మిడివరం వెళ్లే రహదారి గోతులతో నిండిపోయింది. సుమారు 10 కిలోమీటర్ల ఆర్‌అండ్‌బీ రహదారి అధ్వానంగా తయారైంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరకొరగా మరమ్మతులు చేసినా ఫలితం లేకపోయింది. మరిన్ని గోతులు పడడంతో ప్రయాణం చేసే పరిస్థితి లేదు.

ఆలమూరు