విద్యుత్ ఉద్యోగుల ధర్నా
అమలాపురం రూరల్: రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర, డిస్కం ఐక్య కార్యాచరణ కమిటీ ఆదేశాల మేరకు బుధవారం అమలాపురంలోని ఈపీడీసీఎల్ సర్కిల్ ఆఫీస్ వద్ద ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్ని డివిజన్ల యూనియన్లు, అసోసియేషన్ల నుంచి పెద్ద ఎత్తున విద్యుత్ శాఖ ఉద్యోగులు హాజరై, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. జేఏసీ చైర్మన్ ఎంవీ రమణ, జిల్లా కన్వీనర్ ఎ.రాజారత్నం మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులకు, పెన్షనర్ల కుటుంబ సభ్యులకు పూర్తి వైద్య ఖర్చులు చెల్లించాలని, ప్రభుత్వంలో సీపీఎఫ్ కూడిన పెన్షన్ నిబంధనలను 1999 ఫిబ్రవరి ఒకటి నుంచి ఆగస్టు 31 వరకు నియమించిన ఉద్యోగులకు వర్తింప చేయాలని, కాంట్రాక్ట్ లేబర్, అవుట్ సోర్పింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.


