
నానో అభ్యుదయ రైతులకు సన్మానం
ముమ్మిడివరం: నానో ఎరువుల వినియోగంపై అవగాహన పెంచుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి వి.బోసుబాబు అన్నారు. తన కార్యాలయంలో బుధవారం జిల్లా నానో అభ్యుదయ రైతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బోసుబాబు మాట్లాడుతూ గత రెండు సీజన్లలో నానో ఎరువులు ఉపయోగించి అభ్యుదయ రైతులు మంచి ఫలితాలు సాధించారన్నారు. ఇఫ్కొ నానో బాటిల్ కొనుగోలుపై రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా కూడా ఉచితంగా అందిస్తుందన్నారు. నానో అభ్యుదయ రైతులైన మండపేట వెలగతోడుకు చెందిన ఎం.రామసురేష్, తాపేశ్వరానికి చెందిన డి.సతీష్, అలమూరు మండలానికి చెందిన బి.అబ్బులు చౌదరి, ముమ్మిడివరం మండలం ఠానేల్లంకకు చెందిన పోలిశెట్టి బోస్ శ్రీనివాసరావులను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సహయ సంచాలకులు ఎంఏ షంశీ, వ్యవసాయాధికారులు ఏ.అచ్యుతరావు, ఎస్.ప్రశాంత కుమార్, ఇఫ్కొ జిల్లా మేనేజర్ శ్యామ్ ప్రసాద్‌బాబు, రైతులు పాల్గొన్నారు.