
వైఎస్సార్ సీపీలో చేరికలు
మామిడికుదురు: బి.దొడ్డవరం గ్రామంలో శనివారం జరిగిన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నుంచి 22 మంది వైఎస్సార్ సీపీలో చేరారు. పి.గన్నవరం కో–ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. కుడుపూడి త్రిమూర్తులు, మందపాటి సందీప్, గోగి జగదీష్, నేరేడుమిల్లి వినయ్, తాడి వెంకటేశ్వరరావు, తోటే దయా, ఊటాల రెడ్డి, వెంకటరత్నం, సవరపు కిశోర్, తవిటికి ప్రసాద్, సుబ్రహ్మణ్యం, నేదునూరి రాజేష్, శ్రీనివాస్, అయినవిల్లి మధు తదితరులు పార్టీలో చేరారు. కూటమి అరాచక పాలనకు ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుందని కో–ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు తెలిపారు. అందుకే కూటమిని వీడి వైఎస్సార్ సీపీలో చేరుతున్నారన్నారు. పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కొమ్ముల రాము, గ్రామ శాఖ అధ్యక్షుడు పోతుమూడి గోపాలకృష్ణ, కేదారిశెట్టి మల్లేశ్వరరావు, వాకపల్లి వీరాస్వామి, కాండ్రేగుల శ్రీను, కోలా సత్తిబాబు, చింతపల్లి శ్రీను, బొలిశెట్టి శ్రీను, వేగి వీరన్న, యనమదల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.