
బెల్టు షాపులు లేకుండా చూడండి
అమలాపురం రూరల్: బెల్టు షాపులకు ఏ విధమైన ఆస్కారం లేకుండా ఎకై ్సజ్ అధికారులు పటిష్ట పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ఎకై ్సజ్ శాఖ ఈఎస్, సీఐలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మద్యం షాపుల నిర్వాహకులు సమయ పాలన పాటించేలా చర్యలు చేపట్టడంతో పాటు కల్తీ మద్యం విక్రయాలు, రవాణా జరగకుండా నిరోధించాలన్నారు. నాటు సారా తయారీదారులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ సేవలను మెరుగుపర్చండి
ఆర్టీసీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. కలెక్టరేట్‌లో జిల్లాలోని నాలుగు డిపోల మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బస్టాండ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం వసతులు కల్పించాలన్నారు. డిపో మేనేజర్లు చల్లా సత్యనారాయణ మూర్తి, పి.భాస్కరరావు, దానమ్మ, అసిస్టెంట్ మేనేజర్ జీఆర్‌ఎల్ దేవి పాల్గొన్నారు.
ఎకై ్సజ్ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు