నేడు రత్నగిరిపై డయల్‌ యువర్‌ ఈఓ

అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో సోమవారం ‘డయల్‌ యువర్‌ ఈఓ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం గత ఐదేళ్లుగా ప్రతీ నెల చివరి సోమవారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వివిధ కారణాలతో గత మూడు నెలలుగా ఈ కార్యక్రమం నిర్వహించలేదు. మళ్లీ ఈ నెల నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం 10–30 నుంచి 11–30 వరకు భక్తులు 08868–238127 నంబర్‌కు ఫోన్‌ చేసి దేవస్థానం అసిస్టెంట్‌ కమిషనర్‌ రమేష్‌బాబుకు తమ విలువైన సలహాలు, సూచనలతో బాటు ఫిర్యాదులు తెలియ చేయవచ్చునని తెలిపారు.

ఇరువర్గాల మధ్య ఘర్షణ

ముమ్మిడివరం: ఇద్దరు వ్యక్తుల మధ్య చోటుచేసుకున్న వివాదం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీయడంతో ఏడుగురికి గా యాలయ్యాయి. పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం శనివారం రాత్రి జరిగిన వివాదంలో ముమ్మిడివరం మార్కెట్‌ ప్రాంతానికి చెందిన పిసినే రాజుపై దోనిపాటి సముద్రం బీరు బాటిల్‌తో దాడి చేసి గాయపరిచాడు.

దీంతో సముద్రం వర్గీయులను రాజు వర్గీయులు నిలదీయగా ఘర్షణకు దారి తీసి ఏడుగురు గాయాలపాలయ్యారు. సముద్రంతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివప్రసాద్‌ తెలిపారు.
 

Read also in:
Back to Top