నెల వరకు ఎవ్వరూ ఇతనికి ఫోన్‌ చేయొద్దు.. కలవద్దు!

Young Man Went Missing On Suspicion In Uppal - Sakshi

అదృశ్యమా.. కిడ్నాపా?  

సాక్షి, ఉప్పల్‌: అనుమానాస్పదంగా ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జయశంకర్‌ భూపాలపల్లి రేగొండ మండలం, గోరి కొత్తపల్లి ప్రాంతానికి చెందిన భాస్కర్‌(29), ఉప్పల్‌ విజయపురి కాలనీలో ఉంటూ క్యాటరింగ్‌ చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు.  గత నెల 24 తేదీన అతని ఫోన్‌తో తల్లికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌చేసి నెల వరకు ఎవ్వరు ఇతనికి ఫోన్‌ చేయవద్దని అప్పటి వరకు ఎవ్వరూ కలవద్దని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. ఆ తర్వాత ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అతని రూంమెట్‌కు ఫోన్‌ చేయగా రెండు రోజుల క్రితమే ఖాళీ చేసి వెల్లిపోయినట్లు చెప్పాడు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు తెలిసిన వారు, బంధువుల వద్ద ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో సోదరుడు శివకుమార్‌ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశార

యువతిని వేధిస్తున్న వ్యక్తిపై కేసు 
బంజారాహిల్స్‌: యువతిని వేధిస్తున్న వ్యక్తిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.36లోని ఆదిత్యారామ్‌ స్క్వేర్‌లో ఉన్న కన్సల్టెన్సీ సంస్థలో అక్షయ్‌ గనప పని చేసి మానేశాడు. అయితే అందులోనే పని చేస్తున్న ఉద్యోగిని(22)ని కొంత కాలంగా వెంబడిస్తూ వేధిస్తున్నాడు. ఆమె విధులు ముగించుకొని బయటికి రాగానే ఆమెను అనుసరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఎన్నిసార్లు హెచ్చరించినా వినిపించుకోకపోగా ఆమె ఫొటోలను వాట్సాప్‌ ద్వారా పంపిస్తూ దుష్ప్రచారం చేస్తున్నాడు.

ఆమె ప్రతిష్టకు భంగం కలిగిస్తూ ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా ఆమెను హింసిస్తున్నాడు. బంధుమిత్రుల్లో ఆమె పరువు ప్రతిష్టలను నాశనం చేస్తూ ప్రతిరోజూ వేధింపులకు పాల్పడుతుండటంతో ఇటీవల ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితికి వచ్చానని, అక్షయ్‌పై చర్యలు తీసుకోకపోతే తనకు చావే గతి అంటూ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్‌ 509, 354(డి) కింద కేసు నమోదు చేశారు.

చదవండి: ఆసుపత్రి నుంచి గర్భిణి అదృశ్యం.. ‘నాకోసం వెతక్కండి’

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top