మహిళల్లా వేషం.. అర్థరాత్రి హైవేపై నిలబడి..

Two Men Dressed Like A Women To Hijack Cars On National High Way In West Bengal - Sakshi

కోల్‌కతా : మహిళల వేషధారణతో నేషనల్‌ హైవేపై నేరాలకు పాల్పడుతున్న ఇ‍ద్దరు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో రానాఘాట్‌ పోలీస్ స్టేషన్‌ ఏరియా పరిధిలోని నేషనల్‌ హైవే 34పై రాత్రి వేళ పోలీసులు పాట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున చీకటిలో నిలుచుని ఉన్న ఇద్దరు మహిళలు వీరి కంటపడ్డారు. పోలీస్‌ వాహానాన్ని చూడగానే ఆ ఇద్దరు మహిళలు అక్కడినుంచి పరిగెత్తటం మొదలెట్టారు. ( పొగ వదలడం.. ఫుటేజీ ఎత్తుకెళ్లడం వీరి స్టైల్‌ )

దీంతో పోలీసులకు వారిపై అనుమానం వచ్చింది. ఇద్దర్నీ వెంటాడి పట్టుకున్నారు. అనంతరం వారు మహిళలు కాదని, పురుషులని తెలిసి షాక్‌ అయ్యారు. అర్థరాత్రి పూట నేషనల్‌ హైవేపై మహిళల వేషంలో నిల్చుని, వాహనాలను ఆపి వాటిని హైజాక్‌ చేస్తామని, అలా కుదరకపోతే అందులోని వ్యక్తిని దోచుకుంటామని నిందితులు పోలీసుల విచారణలో తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top