అఖిలప్రియ బెయిల్‌పై కొనసాగుతున్న సందిగ్ధత | Suspence Continues On Bhuma Akhila Priya Bail Petition | Sakshi
Sakshi News home page

అఖిలప్రియ బెయిల్‌పై కొనసాగుతున్న సందిగ్ధత

Jan 21 2021 4:46 PM | Updated on Jan 21 2021 5:05 PM

Suspence Continues On Bhuma Akhila Priya Bail Petition - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితురాలు భూమా అఖిలప్రియ బెయిల్ పటిషన్‌పై సందిగ్ధత కొనసాగుతోంది. అఖిలప్రియ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సెషన్స్ కోర్టు రేపటికి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది. భార్గవ్‌రామ్, జగత్‌విఖ్యాత్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్లను ​కూడా వాయిదా వేసింది. దీంతో ఈ మూడు బెయిల్ పిటిషన్లపై సికింద్రాబాద్ కోర్టు రేపు మరోసారి విచారించనుంది. కాగా మూడు బెయిల్ పిటీషన్లపై కూడా  పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. భూమా అఖిలప్రియకు సంబంధించి రెండుసార్లు బెయిల్ పిటీషన్లు ఇప్పటికే రెండుసార్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో శుక్రవారం నాడు ఎటువంటి తీర్పు వెలువడనుందే ఆసక్తి నెలకొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement