Hyderabad: స్పా సెంటర్‌పై పోలీసుల దాడి.. కస్టమర్లు, యువతుల అరెస్ట్

సాక్షి, హైదరాబాద్: స్పాసెంటర్‌పై ఎస్‌వోటీ పోలీసులు దాడి చేసి ముగ్గురు కస్టమర్లు, ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకొని వనస్థలిపురం పోలీసులకు అప్పగించారు. పోలీసుల వివరాల ప్రకారం నాగోలు మమతానగర్‌కు చెందిన నాగోజు విగ్నేష్‌రాజు(32) వనస్థలిపురం పనామా చౌరస్తా సమీపంలో ఫ్యూజియన్ హునిక్స్ స్పాసెలూన్ నిర్వహిస్తున్నాడు.
ఎల్‌బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు దాడిచేసి అత్తాపూర్‌కు చెందిన ఎల్లమద్ది నగేశ్(27) జగదీష్Ù(37) అశోక్(40)తో పాటు ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే ఈ సెంటర్‌పై కేసు నమోదైందని, అయినా వారు నిబందనలు పాటించకపోవడంతో మరోసారి ఎస్‌వోటీ పోలీసులు దాడి చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. స్పాసెంటర్‌ను తక్షణమే ఖాళీ చేయించాలని, లేదంటే ఆ అంతస్తును సీజ్ చేయిస్తామని భవన యజమానిని వనస్థలిపురం సీఐ సత్యనారాయణ హెచ్చరించారు.
సంబంధిత వార్తలు