అత్తగారింటి ఎదుట అల్లుడి నిరసన.. అసలు ఏం జరిగిందంటే? | Sakshi
Sakshi News home page

అత్తగారింటి ఎదుట అల్లుడి నిరసన.. అసలు ఏం జరిగిందంటే?

Published Sun, Apr 2 2023 4:50 PM

Son In Law Protest In Front house Of Mother In Law In Kodada - Sakshi

సాక్షి, సూర్యాపేట జిల్లా: అత్తగారింటి ఎదుట అల్లుడు నిరసనకు దిగిన ఘటన కోదాడలో జరిగింది. తన కొడుకుని చూపించకుండా అత్తమామలు వేధిస్తున్నారంటూ ఆ అల్లుడు ఆరోపిస్తున్నాడు. భార్యాభర్తలైన  ప్రవీణ్ కుమార్, పృథ్వీ రమణీల మధ్య విభేదాలు రావడంతో గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు.

బాబుని తల్లిదండ్రుల చెంతనే‌ ఉంచి పృథ్వీ రమణీ  కెనడా వెళ్లింది. వారం వారం కుమారుడిని‌ చూసేందుకు కోర్టు అనుమతి ఇచ్చిందంటున్న ప్రవీణ్.. తన కొడుకును చూడకుండా అత్తామామలు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నాడు. తన నుంచి కొడుకును దూరం చేసే కుట్ర జరుగుతోందంటూ ప్రవీణ్‌.. తన తల్లిదండ్రులతో కలిసి అత్తగారింటి ఎదుట ఆందోళనకు దిగాడు.
చదవండి: హైదరాబాద్‌లో 59 రూపాయలకే చికెన్‌ బిర్యానీ..ఎక్కడో తెలుసా

Advertisement
 
Advertisement