Software Employee Committed Suicide Over Love Failure At Khammam - Sakshi
Sakshi News home page

పెళ్లికి నిరాకరించాడని.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య  

Jul 2 2022 8:41 PM | Updated on Jul 5 2022 9:05 AM

Software Employee Commits Suicide in Thallada Khammam - Sakshi

త్రివేణి (ఫైల్‌)

ఖమ్మం: ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించాడని ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని మనప్తాపంతో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గురువా రం రాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు. తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామానికి చెందిన ముదిగొండ త్రివేణి(22) కలకొడిమ గ్రామానికి చెందిన అనంతోజు రవీంద్ర ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇద్దరూ బీటెక్‌ చదివారు.

త్రివేణి ఇంటి వద్ద నుంచే ఆన్‌లైన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తుండగా.. రవీంద్ర ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నారు. గత ఎనిమిది నెలలుగా ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి మభ్యపెట్టి ఇప్పుడు పెళ్లి చేసుకోనని చెప్పడంతో మనస్తాపం చెందిన త్రివేణి ఈ నెల 27న గడ్డి మందు సేవించింది. ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. ఈ మేరకు ఎస్‌ఐ సురేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు   చేస్తున్నారు.  

చదవండి: (రెండో భర్త ఫిర్యాదు.. మూడో భర్తతో కలిసి..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement